PGannavaram: పి.గన్నవరం మండలంలో ఒకే విద్యార్థి ఉన్న పాఠశాల!
PGannavaram: పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లిలో ఒకే విద్యార్థి, ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో ఏకగ్రీవంగా ఎస్ఎంసి చైర్మన్ ఎన్నిక జరగడం విశేషంగా నిలిచింది.
PGannavaram: పి.గన్నవరం మండలంలో ఒకే విద్యార్థి ఉన్న పాఠశాల!
PGannavaram: పి గన్నవరం మండలం ఆర్ ఏనుగుపల్లి గ్రామం ఎల్లమెల్లి వారి పేట మండల ప్రజా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ నందు ఒకే విద్యార్థి ఒకే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమునకు ఒక ఆయా.
ఇదే విషయమై స్కూలు ఉపాధ్యాయుడు సూర్య ప్రకాశరావును స్కూలులో విద్యార్థులు లేరేమని అడగగా విద్యార్థుల కోసం వేసవికాలంలో క్యాంపెనింగ్ చేశామని కానీ ఎవరు జాయిన్ అవ్వలేదని తెలిపారు.
గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులు ఉండేవారని ఇద్దరు టీసీ తీసుకుని వేరే స్కూలుకు వెళ్లిపోయారని ఉపాధ్యాయుడు అన్నారు
ఇదే విధంగా రాష్ట్రంలో చాలా పాఠశాలలు తక్కువ మంది విద్యార్థులతో నడుస్తున్నాయి.వీటికి ఖర్చు కూడా లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజల కోరుకుంటున్నారు.
ఈ స్కూల్ నందు మరొక వింత ఘటన చోటు చేసుకుంది. నిన్న జరిగిన స్కూల్ చైర్మన్ ఎస్ఎంసి ఎలక్షన్ లో విద్యార్థి తండ్రి ఈతకోట దేవి వరప్రసాద్ ఒక్కరే హాజరవుగా అతడినే ఏకగ్రీవంగా ఎన్నిక చేసి చైర్మన్గా ప్రమాణస్వీకారం చేయించామని ఉపాధ్యాయుడు తెలిపారు.




