Razole: రాజోలు లో ఘనంగా సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు
Razole: అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా రాజోలులో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Razole: రాజోలు లో ఘనంగా సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు
రాజోలు: అపరభగీరథుడు, గోదావరి జిల్లాల సస్యశ్యామల అభివృద్ధికి మార్గదర్శకుడైన సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా రాజోలు ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.., సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టలు, కాలువల వ్యవస్థల వల్లే గోదావరి డెల్టా ప్రాంతం అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు. రైతాంగ అభివృద్ధి, సాగునీటి విస్తరణ, వ్యవసాయాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సర్ ఆర్థర్ కాటన్ ని దేవుడిలా భావిస్తారని తెలిపారు.
రైతుల సంక్షేమం, సాగునీటి సమస్యల పరిష్కారం, కాలువల ఆధునీకరణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.రైతులకు సమృద్ధిగా నీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.




