Sompalli: సోంపల్లి అభివృద్ధికి మరో ముందడుగు.. రూ.50 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన
Sompalli: రాజోలు మండలం సోంపల్లిలో రూ.50 లక్షల పుష్కరాల నిధులతో చేపట్టనున్న 800 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Sompalli: సోంపల్లి అభివృద్ధికి మరో ముందడుగు.. రూ.50 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన
రాజోలు: రాజోలు మండలం సోంపల్లి గ్రామంలో రూ.50 లక్షల పుష్కరాల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు. సోంపల్లి శివాలయం నుంచి పొదలాడ లిమిట్స్‌లోని ఎఫ్‌సీఐ గోడౌన్ వరకు 800 మీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. పుష్కరాల సమయంలో శివాలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే భక్తులకు, గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో సోంపల్లి శివాలయానికి వచ్చే భక్తులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.




