Amalapuram: అమలాపురంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల క్యాండిల్ ర్యాలీ!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో అమలాపురంలో క్యాండిల్ ర్యాలీ. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు.

SURESH, AMALAPURAM
Published on: 1 Nov 2026 7:06 AM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల క్యాండిల్ ర్యాలీ!

Amalapuram: పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు ఆర్మోడ్ రిజర్వడ్ కార్యాలయం నుండి గడియారం స్తంభం వరకు పోలీసుశాఖ మరియు ప్రజల తో కలిసి 'క్యాండిల్ ర్యాలీ' నిర్వహించి,అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

విధి నిర్వహణలో దేశం కోసం,ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ,వారి కుటుంబానికి శాంతి చేకూర్చాలని,వారి కుటుంబానికి పోలీస్ ఎప్పుడూ అండ దండగా ఉంటుందనే నమ్మకం కలిపిస్తూ ఈ సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్,ఏఆర్ డీఎస్పీ జి.యు.కె.ఎల్.వి. సుబ్బరాజు ఎస్బీ సీఐ వి.పుల్లారావు,ఆర్‌ఐ యన్.బ్రహ్మానందం,ఆర్‌యస్ఐ లు,జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు,సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM