Amalapuram: ప్రజా భద్రతలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములు కావాలి!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అమలాపురంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో అవగాహన సమావేశం.
Amalapuram: ప్రజా భద్రతలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములు కావాలి!
Amalapuram: ప్రజలకు సైబర్ నేరాలు,రోడ్డు భద్రత,మహిళల భద్రత, మాదకద్రవ్యాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,ఐపీఎస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా పోలీస్ కార్యాలయం అమలాపురం నందు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి:
సైబర్ మోసాలు,ఆన్‌లైన్ మోసాలు,డిజిటల్ అరెస్టులు, OTP/UPI మోసాలు తదితరాలపై ప్రజలను అప్రమత్తం చేసేలా తక్కువ నిడివి గల వీడియోలు,లఘు చిత్రాలు రూపొందించాలని ఎస్పీ సూచించారు.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు:
ధృవీకరించని వార్తలు, వదంతులు,రెచ్చగొట్టే వీడియోలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని సూచించారు. అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కీలక సమయాల్లో వాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయాలి:
విపత్తులు,ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో పోలీసు శాఖ అందించే అధికారిక సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు సహకరించాలని కోరారు.
మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలి
ఇంస్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా గంజాయి,మత్తు పదార్థాల విక్రయాలు లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
రోడ్డు భద్రత -మహిళల భద్రతపై అవగాహన
హెల్మెట్,సీటుబెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, అతివేగం నివారణతో పాటు మహిళలు,బాలికల భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.
"సోషల్ మీడియా ఒక శక్తివంతమైన వేదిక
దాన్ని సమాజ హితం కోసం ఉపయోగిద్దాం"
సైబర్ నేరాల నియంత్రణలో పోలీసులతో కలిసి పనిచేద్దాం. ప్రజల భద్రతకు భాగస్వాములవుదాం అని ఎస్పీ తెలియజేశారు.




