Razole: జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంక్.. రాజోలు విద్యార్థిని ఘనత!

Razole: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఇన్‌స్టంట్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు.

PRABHU, RAZOLE
Published on: 19 Jun 2026 3:00 PM IST
Razole
X

Razole: జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంక్.. రాజోలు విద్యార్థిని ఘనత!

రాజోలు: ఇంటర్మీడియట్ ఇన్‌స్టంట్ పరీక్షల్లో రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ జె. శాంతకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కె. జ్ఞానేశ్వరి 981 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కె. అక్షయ 465 మార్కులు, బైపీసీ విభాగంలో ఎండి నజరీన్ ఖనూన్ 447 మార్కులు, సీఈసీ విభాగంలో కె. శార్వాణి 482 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారని తెలిపారు.

ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ శాంతకుమారి పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని ఆమె కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story