Ramachandrapuram: పరిధిలో దస్తావేజు లేఖర్ల భారీ ఆందోళన!
Ramachandrapuram: కోనసీమ జిల్లా ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు జీవో 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ సమ్మె చేపట్టడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి.
Ramachandrapuram: రామచంద్రపురం పరిధిలో దస్తావేజు లేఖర్ల భారీ ఆందోళన!
రామచంద్రపురం: ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జి ఒ నంబర్ 396 కు వ్యతిరేకంగా నిరసన నిర్వహించిన దస్తావేజు లేఖర్లు.
ఈ సందర్బంగా దస్తా వేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడం తో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు.రిజిస్టేషన్ ప్రక్రియను మొత్తం ప్రైవేటు కంపెనీలకు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 396ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన దస్తావేజు లేఖర్లు.
ఈ జీవో అమలుతో దస్తావేజు లేఖర్ల ఉపాధి కోల్పోతారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న దస్తావేజు లేఖర్లు.ఈ జి ఒ వల్ల కంప్యూటర్ ఆపరేటర్లు, జిరాక్స్ కేంద్రాల నిర్వాహకులపై కూడా ప్రభావం చూపుతుందంటున్న కంప్యూటర్ ఆపరేటర్లు.
తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలు ఈ జి ఒ అమలు తో రోడ్డున పడతామంటున్న దస్తా వేజు లేఖర్లు.వేలాది మంది జీవనోపాధిపై జీవో 396 ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న దస్తా వేజు లేఖర్లు.
తమ హక్కులు, ఉపాధిని కాపాడాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించిన దస్తా వేజు లేఖర్లు.
ద్రాక్షారామ దస్తా వేజు లేఖర్లు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం లో దస్తా వేజు లేఖర్లు పాల్గొన్నారు.




