Kadiyam: మహానటుడు "ఎస్వీ రంగారావు" విగ్రహాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలి
Kadiyam: మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగాన్ని ఏలిన మహానటుడు ఎస్.వి. రంగారావు. దవళేశ్వరంలో ఆయన తండ్రి ఉద్యోగం చేసిన కాలం నాటి జ్ఞాపకాలపై ప్రత్యేక కథనం.
Kadiyam: మహానటుడు "ఎస్వీ రంగారావు" విగ్రహాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలి
కడియం: సామర్ల వేంకట రామారావు అంటే ఎవరూ గుర్తుపట్టలేరేమో కానీ "ఎస్ వి రంగారావు" అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. మూడు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశ్వనట చక్రవర్తిగా వెలుగొందిన మహానటుడు. భారత రాష్ట్రపతి బహుమతి, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
ఆయన 56 వ యేట 1974 సంవత్సరంలో చెన్నైలో గుండెపోటుతో మరణించారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా మిగిలిపోయారు. ఆయనకు రాజమహేంద్రవరం రూరల్, దవళేశ్వరం గ్రామానికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ, ఆయన తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో కొంతకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని, ఆ సమయంలోనే పలుమార్లు ఎస్వీ రంగారావు ధవళేశ్వరం వచ్చేవారని ఇక్కడివారు చెబుతారు.
ఆ అనుబంధంతోనే ధవలేశ్వరంలో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని 2012 సంవత్సరంలో ప్రతిష్టించారని సమాచారం. పర్యవేక్షణా లోపమో, మరి ఏ ఇతర కారణమో తెలియదు కానీ, గత కొంతకాలంగా అక్కడే నడిరోడ్డు ప్రక్కన విగ్రహాన్ని ముసుగేసి ఉంచడం పట్ల, ఆయన అభిమానులు సీనియర్ సినీ ప్రేమికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విగ్రహానికి మెరుగులు దిద్ది, సరికొత్తగా ఆవిష్కరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.




