Tatipaka: తాటిపాకలో ఘనంగా డా. కంచెర్ల వెంకట్రావు జన్మదిన వేడుకలు!

Tatipaka: రాజోలు మండలం తాటిపాకలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డా. కంచెర్ల వెంకట్రావు జన్మదిన వేడుకలు. 500 మట్టి విగ్రహాల పంపిణీ.

PRABHU, RAZOLE
Published on: 13 Sept 2026 3:30 PM IST
Tatipaka
X

Tatipaka: తాటిపాకలో ఘనంగా డా. కంచెర్ల వెంకట్రావు జన్మదిన వేడుకలు!

Tatipaka: రాజోలు మండలం తాటిపాక లోని సాయి బాలాజీ అపార్ట్‌మెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డా. కంచెర్ల వెంకట్రావు (బాబి) జన్మదిన వేడుకలను అభిమానులు, ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ 500 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు సహకరించాలని నిర్వాహకులు సూచించారు.

డా. కంచెర్ల వెంకట్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో అభిమానులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE