Razole: ‘ఇరుముడి’ విజయం తాటిపాక కృష్ణ స్వామికి ప్రత్యేక గౌరవం!

Razole: ఇరుముడి సినిమాలో గురుస్వామి పాత్రలో మెప్పించిన తాటిపాక కృష్ణ స్వామి. దర్శకుడు శివ చేతుల మీదుగా ప్రత్యేక జ్ఞాపిక ప్రదానం.

PRABHU, RAZOLE
Published on: 11 Sept 2026 7:57 AM IST
Razole
X

Razole: ‘ఇరుముడి’ విజయం తాటిపాక కృష్ణ స్వామికి ప్రత్యేక గౌరవం!

Razole: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన పాటబళ్ల కృష్ణ స్వామి ‘ఇరుముడి’ సినిమాలో పోషించిన గురుస్వామి పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఆయన నటనలో భక్తి భావం, గురుస్వామి ఔన్నత్యం ప్రతిబింబించడం విశేషంగా నిలిచింది.

సినిమా విజయానికి కృష్ణ స్వామి పాత్ర ఎంతో దోహదపడిందని దర్శకుడు శివ పేర్కొంటూ, ఆయన చేతుల మీదుగా ప్రత్యేక జ్ఞాపిక అందించడం తాటిపాకతో పాటు రాజోలు ప్రాంత ప్రజలకు గర్వకారణంగా మారింది. అయ్యప్ప స్వామి పాత్రలో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేయడం స్వామివారి అనుగ్రహంగా స్థానికులు భావిస్తున్నారు.

తాటిపాక గడ్డపై పుట్టిన కృష్ణ స్వామి తన నటనా ప్రతిభతో వెండితెరపై గుర్తింపు తెచ్చుకుని ఈ ప్రాంతానికి పేరు తీసుకురావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు మామిడికుదురు మండలం పెదపట్నంలంకకు చెందిన ఆకుల సత్యనారాయణ మూర్తి కూడా ఈ అరుదైన జ్ఞాపికను స్వీకరించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కృష్ణ స్వామి మరెన్నో ఉన్నత పాత్రలు పోషించి మరింత కీర్తి పొందాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story