Razole: బీసీల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది: గొల్లపల్లి అమూల్య

Razole: బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య శివకోటి ఆత్మగౌరవ సభలో స్పష్టం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 10 Oct 2026 7:53 PM IST
Razole
X

Razole: బీసీల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది: గొల్లపల్లి అమూల్య

రాజోలు: బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య అన్నారు. శివకోడ్‌లోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ, రాజోలు మండల టీడీపీ అధ్యక్షురాలు అనుసూరి సునీత పురుషోత్తం అధ్యక్షతన బీసీల ఆత్మగౌరవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమూల్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, కల్లుగీత వృత్తిదారులకు మద్యం దుకాణాల కేటాయింపు, నాయి బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ వంటి కార్యక్రమాల ద్వారా బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వల్ల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం జరిగిందని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.

బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమూల్య పిలుపునిచ్చారు. బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కేతా వెంకటలక్ష్మి, చింత వీరభద్రేశ్వరరావు, లంకే శ్రీనివాస్, శంకరపు ఆదినారాయణ, కాకి లక్ష్మణ్, అంతర్వేదిపాలెం పుల్లయ్య, కడలి శ్రీ దుర్గా, మెరుగుమువ్వల ప్రసాద్, ఒగ్గు నారాయణమూర్తి, మానుకొండ దుర్గాప్రసాద్, మానేపల్లి రామకృష్ణ, తిరుమాణి ఆచారి, అయినవిల్లి సత్యనారాయణ, పొన్నాల విజయ్, ఇల్లంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE