Amalapuram: కుక్కకాటు చికిత్సపై వైసీపీ చిల్లర రాజకీయం: దెందుకూరి సత్తిబాబు!
Amalapuram: అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కుక్కకాటు బాధితులకు మెడికల్ ప్రోటోకాల్ చికిత్సపై వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ నేత దెందుకూరి సత్తిబాబు రాజు ధ్వజమెత్తారు.
Amalapuram: కుక్కకాటు చికిత్సపై వైసీపీ చిల్లర రాజకీయం: దెందుకూరి సత్తిబాబు!
అమలాపురం: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో పిచ్చికుక్క కరిచి వారు ఆపదలో ఉంటే వైఎస్సార్ పార్టీ ఇంచార్జ్ వచ్చి వారిని పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై వ్యంగ్యంగా మాట్లాడడం సరైంది కాదని అల్లవరం టీడీపీ అధ్యక్షుడు సత్తిబాబు రాజు విమర్శించారు. అల్లవరం మండలంలోని బోడసకుర్రు గ్రామంలో పిచ్చి కుక్క కరిచి నలుగురికి గాయాలయ్యాయి.దీంతో అమలాపురం ఏరియా ఆసుపత్రిలో వారికి చికిత్స అందించారు.
ఈ క్రమంలోనే ఫస్ట్ ఎయిడ్ ప్రోటోకాల్ ప్రకారం సబ్బుతో కడిగి ప్రాథమికంగా చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స అందించారు. కుక్కకాటు బాధితులను పరామర్శించిన వైసీపీ అమలాపురం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ అనంతరం మీడియాతో మాట్లాడారు.కుక్కకాటు గాయాన్ని సబ్బుతో కడగడంపై దీనిని తప్పుబడుతూ పలు విమర్శలు చేశారు.పిచ్చి కుక్క కరిస్తే రిన్ సబ్బుతో కడిగి వైద్యం చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల పనితీరుపై ఆరోపణలు చేశారు. దీంతో ఏరియా ఆసుపత్రి సూపరెంటిండెంట్ శంకర రావు కూడా ఖండిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.బాధితులు అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన వారు కావడంతో దీనిపై టిడిపి అల్లవరం మండల అధ్యక్షుడు,రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు తీవ్రంగా స్పందించారు.
ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పిచ్చి కుక్క కాటు కు ప్రాధమికంగా సబ్బుతో కడగడం మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారంగానే జరిగిందని,అయితే కుక్క కాటు విషయంలోనూ రాజకీయం చేయడం దారుణమన్నారు. పిచ్చికుక్క కరిచి వారు ఆపదలో ఉంటే వైఎస్సార్ పార్టీ ఇంచార్జ్‌గా వచ్చి వారిని పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై వ్యంగ్యంగా మాట్లాడడం సరైంది కాదన్నారు.
వైసీపీ నాయకులకు జన్మతహ విమర్శలు చేయడం అలవాటు అనుకుంటానన్నారు. ఇన్ఫెక్షన్ పోయేందుకు సబ్బుతో కడగడం సర్వ సాధారణమేనని, పిల్లలకు అందిన వైద్యసదుపాయంపై వారు చాలా సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. ఒక బాద్యతగలిగిన వ్యక్తి ఇలా మాట్లాడడం సరైంది కాదన్నారు సత్తిబాబు రాజు తీవ్రంగా విమర్శించారు.




