Razole: ప్రతీ ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిందే లేదంటే మీ ఓటు గాల్లో కలిసిపోతుంది!

Razole: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE
Published on: 5 Jun 2026 12:35 PM IST
Razole
X

Razole: ప్రతీ ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిందే లేదంటే మీ ఓటు గాల్లో కలిసిపోతుంది!

రాజోలు: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు.

రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ గ్రామంలోని పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే "కార్యకర్తే అధినేత" కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు అయ్యేలా చూడటంతో పాటు, ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దేందుకు ప్రజలకు సహకరించాలని ఆమె కోరారు.

ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమని పేర్కొన్న అమూల్య, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం గురించి వివరించి, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పులు, చిరునామా సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించడంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు.

అనంతరం పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించడం వంటి అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు ఈశ్వర రాజువర్మ, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు పెచ్చెటి బాబు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story