P. Gannavaram: పితాని రాంబాబు మృతి: కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి!

P. Gannavaram: పి. గన్నవరం టీడీపీ నాయకులు పితాని రాంబాబు కన్నుమూత. వారి భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.

RAJU, P GANNAVARAM
Published on: 23 Jun 2026 12:54 PM IST
P. Gannavaram
X

P. Gannavaram: పితాని రాంబాబు మృతి: కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి. గన్నవరం మండలం, పితానివారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పితాని రాంబాబు గారు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి అకాల మరణం చెందారు.

ఈరోజు ఉదయం వారి భౌతిక కాయానికి పూలమాల వేసి పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

అనంతరం శ్రీ పితాని రాంబాబు గారి సేవలను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ పరామర్శ యాత్రలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని శ్రీ పితాని రాంబాబు గారికి ఘన నివాళులు అర్పించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story