P Gannavaram: సీఎం చంద్రబాబును కలిసిన పి.గన్నవరం మండల టీడీపీ అధ్యక్షురాలు!

P Gannavaram: టీడీపీ అధ్యక్షురాలిగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడును మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్తిపాటి ఉమామహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.

RAJU, P GANNAVARAM
Published on: 9 Aug 2026 7:25 PM IST
P Gannavaram
X

P Gannavaram: సీఎం చంద్రబాబును కలిసిన పి.గన్నవరం మండల టీడీపీ అధ్యక్షురాలు!

పి.గన్నవరం: పి.గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్తిపాటి ఉమామహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడినీ ప్రత్తిపాటి ఉమామహేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళకు మండల పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం పి.గన్నవరం మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రత్తిపాటి ఉమామహేశ్వరి తెలిపారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story