Devarapalli: జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి కూటమి ఎమ్మెల్యేల ఘాటు విమర్శలు

Devarapalli: జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి అని గోపాలపురం, పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, సొంగా రోషన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 4 Aug 2026 9:40 PM IST
Devarapalli
X

Devarapalli: జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి కూటమి ఎమ్మెల్యేల ఘాటు విమర్శలు

దేవరపల్లి: జగన్మోహన్ రెడ్డి అంటేనే రైతు ద్రోహి అని, గత వైకాపా ప్రభుత్వంలో రైతులను అప్పులు ఊబిలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ విమర్శించారు.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో టిడిపి నాయకులు పెన్మత్స సుబ్బరాజు ఇంటి వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లులో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు పొగాకు ధరలపై, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ని పొగాకు ధరలపై చర్చకు సిద్ధమన్నారు.

రైతు వ్యతిరేకైన జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని దేవరపల్లి వస్తున్నారని ప్రశ్నించారు. రీ సర్వే పేరుతో కురుకూరులోని రైతులందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు.

గోపాలపురం,పోలవరం,చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గాల్లో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నారని విమర్శించారు.

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతుల భూమిని కబ్జా చేయాలని, దోచేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.

దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులను, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన పరిస్థితి గత వైకాపా ప్రభుత్వంలో జరిగిందన్నారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story