Atreyapuram: కొత్తపేట నియోజకవర్గంలో గ్రంథాలయ సదుపాయాల పరిశీలన

Atreyapuram: కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని గ్రంథాలయాన్ని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య సందర్శించారు.

PRABHU, RAZOLE
Published on: 19 May 2026 4:11 PM IST
Atreyapuram
X

Atreyapuram: కొత్తపేట నియోజకవర్గంలో గ్రంథాలయ సదుపాయాల పరిశీలన

Atreyapuram: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని గ్రంధాలయాన్ని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య సందర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ (సాయిబాబా రాజు) తో కలిసి కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లోని గ్రంథాలయాన్ని గొల్లపల్లి అమూల్య సందర్శించారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ..

గ్రంథాలయాన్ని సందర్శించటం చాలా సంతోషంగా ఉందని, మరల తను చదువుకున్న చిన్ననాటి రోజులు, కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయని అని ఆమె భావోద్వేగమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ సాయిబాబా రాజు తో కలిసి గ్రంథాలయంలోని సదుపాయాలను పరిశీలించారు. అక్కడ చదువుకోవడానికి వచ్చిన స్థానిక విద్యార్థులతో ఆమె సంభాషించారు. వారి వెంట వాడపల్లి దేవస్థానం చైర్మన్ గబ్బర్ సింగ్ మరియు గ్రంథాలయం సిబ్బంది ఉన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story