Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం!

Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం. గిడుగు సేవలు చిరస్మరణీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు వ్యాఖ్య.

PRABHU, RAZOLE
Published on: 29 Aug 2026 2:07 PM IST
Razole
X

Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం!

Razole: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిడుగు వెంకట రామమూర్తి 163వ జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

న్యూజివీడు IIIT కళాశాల తెలుగు ఆచార్యులు జడ సుబ్బారావు, కళాశాల అభివృద్ధి ప్రదాత పొన్నాడ సూర్య ప్రకాష్ విశిష్ట అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు మాట్లాడుతూ.. తెలుగు భాషను గ్రాంథిక భాష నుంచి వ్యావహారిక భాషగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మాతృభాష పరిరక్షణ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

తెలుగు భాషతో ముడిపడి ఉన్న మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలలో వినూత్న కార్యక్రమాల నిర్వహణకు పలువురు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నల్లి రాజు మరియు బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story