Sakhinetipalli: ఆలయాల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు నిందితుడు అరెస్ట్!

Sakhinetipalli: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో జరిగిన జంట దేవాలయాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

PRABHU, RAZOLE
Published on: 11 July 2026 7:54 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: ఆలయాల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు నిందితుడు అరెస్ట్!

సఖినేటిపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం, పక్కనే ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో అమ్మవార్ల మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలను చోరీ చేసిన కేసును సఖినేటిపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 26న ఆలయాల్లోని అమ్మవార్ల మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసి పరారయ్యాడు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొత్తపేట సబ్‌ డివిజనల్ పోలీస్ అధికారి సూచనలతో, రాజోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్సై దుర్గా శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామానికి చెందిన బొక్కా లోకేశ్వరావు (19)ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 8.6 గ్రాముల బరువున్న రెండు జతల బంగారు మంగళసూత్రాలు, హీరో మాస్ట్రో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని రాజోలు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో రిమాండ్ రిపోర్టుతో హాజరుపరిచినట్లు సఖినేటిపల్లి ఎస్‌ఐ దుర్గా శ్రీనివాస్ తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story