P.Gannavaram: వరద ఉధృతికి బాహ్య ప్రపంచంతో తెగిన లంక గ్రామాల సంబంధాలు!

P.Gannavaram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద తాత్కాలిక మట్టి గట్టు వరదలకు కొట్టుకుపోయింది.

RAJU, P GANNAVARAM
Published on: 31 July 2026 9:28 AM IST
P.Gannavaram
X

P.Gannavaram: వరద ఉధృతికి బాహ్య ప్రపంచంతో తెగిన లంక గ్రామాల సంబంధాలు!

P.Gannavaram: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నదీపాయల్లో వరద ఉధృతి‌ పెరిగుతూ వస్తుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద నదీపాయను దాటేందుకు నిర్మించిన తాత్కాలిక గట్టు వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

​నదిలో కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి ప్రతి ఏటా వర్షాకాలం ముగిసిన తరువాత పంటల రవాణా కోసం, గ్రామస్థుల రాకపోకలకు తాత్కాలిక పరిష్కారంగా ఈ నదీపాయపై మట్టి గట్టును ఏర్పాటు చేసుకొంటారు. అయితే ప్రతీ ఏటా వర్షాల సీజన్ లో ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఒత్తిడి తట్టుకోలేక ఈ గట్టు తెగిపోతుంటుంది.

ఇదేవిధంగా ఈ సీజన్ లో‌ కూడా ఉధృతంగా వచ్చిన వరద నీటికి గంటి పెదపూడి లంక వద్ద మట్టి గట్టు కొట్టుకుపోవడంతో లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు మొదలయ్యాయి. ఈ గట్టు తెగిపోవడంతో పరిసరాల్లోని ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపాలెం, గంటిపెదపూడి లంక గ్రామాల్లో రోజువారీ పనులు, చదువులు, వ్యాపారాల కోసం బాహ్య ప్రపంచం లోకి రావాల్సిన ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. వీరికి వరదల సీజన్ ముగిసే వరకూ అత్యవసర పనులకు, రాకపోకలకు, విద్యార్థులకు నాటు పడవలే దిక్కు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story