Mamidikuduru: నగరంలో దొంగల హల్‌చల్ తాళం వేసిన ఇంట్లో చోరీ!
Mamidikuduru: మామిడికుదురు మండలం నగరంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం. హైదరాబాద్‌లో ఉంటున్న కుటుంబం, కేసు నమోదు చేసిన పోలీసులు.
Mamidikuduru: నగరంలో దొంగల హల్‌చల్ తాళం వేసిన ఇంట్లో చోరీ!
Mamidikuduru: మామిడికుదురు మండలం నగరం మెయిన్‌రోడ్డులోని గెడ్డం రామారావు ఇంట్లో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తుండటంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని దొంగలు అదునుగా తీసుకున్నారు.
వెనుక తలుపులు పెకలించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రెండు బీరువాలను బద్దలు కొట్టి, ఇంట్లోని సామగ్రిని చెల్లాచెదురుగా పడేశారు. శుక్రవారం పనిమనిషి ఇంటిని పరిశీలించగా చోరీ జరిగిన విషయం గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన నగదు, బంగారు ఆభరణాలు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. దొంగలను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
Next Story




