Malikipuram: లక్కవరంలో అబ్బురపరుస్తున్న 12 అంగుళాల పుంగనూరు ఆవు!

Malikipuram: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరం గ్రామంలో కేవలం 12 అంగుళాల ఎత్తు ఉన్న అత్యంత అరుదైన పుంగనూరు ఆవు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

PRABHU, RAZOLE
Published on: 5 July 2026 1:26 PM IST
Malikipuram
X

Malikipuram: లక్కవరంలో అబ్బురపరుస్తున్న 12 అంగుళాల పుంగనూరు ఆవు!

మలికిపురం: డాక్టర్ .బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో అత్యంత అరుదైన జాతికి చెందిన 12 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు ఆవు స్థానికులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గ్రామానికి చెందిన బోణం కాశీ ఈ పుంగనూరు ఆవుకు "మహాలక్ష్మి" అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుతున్నారు. చిన్నారి బిడ్డలా చూసుకుంటూ ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ అరుదైన పుంగనూరు ఆవును కొనుగోలు చేసేందుకు ఇప్పటికే పలువురు రూ.3 లక్షల వరకు ధర ఆఫర్ చేసినప్పటికీ, తమ కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్న మహాలక్ష్మిని విక్రయించే ఉద్దేశం లేదని, ఎంత ధర వచ్చినా అమ్మబోమని బోణం కాశీ స్పష్టం చేశారు.

అరుదైన ఆకృతి, చిన్న పరిమాణం కారణంగా ఈ పుంగనూరు ఆవును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story