Korukonda: కోరుకొండలో మారని ట్రాఫిక్ సమస్య.. మట్టి లారీలతో స్తంభిస్తున్న రాకపోకలు!

Korukonda: కోరుకొండలో మట్టి లారీల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది.

NARAYANA, RAJANAGARAM
Published on: 13 Jun 2026 7:55 AM IST
Korukonda
X

Korukonda: కోరుకొండలో మారని ట్రాఫిక్ సమస్య.. మట్టి లారీలతో స్తంభిస్తున్న రాకపోకలు!

Korukonda: కోరుకొండలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్వామివారి ఆలయం నుంచి వచ్చే ప్రధాన రహదారిపై మట్టి లారీల రాకపోకలు అధికంగా ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇరుకైన రహదారిలో రెండు భారీ లారీలు ఎదురెదురుగా ప్రయాణించేందుకు ప్రయత్నించడం వల్ల తరచూ ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుండగా, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఏదైనా ప్రమాదం లేదా అవాంఛనీయ ఘటన చోటుచేసుకున్న తర్వాత మాత్రమే నిబంధనలు గుర్తుకు వస్తున్నాయని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని వారు వాపోతున్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story