Polavaram: తుపాను నేపథ్యంలో ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు!
Polavaram: అర్నబ్ తుపాను కారణంగా ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించిన కలెక్టర్ దినేష్ కుమార్. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు నిబంధనలు వర్తింపు.
Polavaram: తుపాను నేపథ్యంలో ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు!
పోలవరం: అర్నబ్ తుఫాను ప్రభావంతో కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలతో పాటు తీవ్ర గాలులు వీస్తున్న నేపథ్యంలో పోలవరం జిల్లాలోనూ గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని, గంటకు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుఫాను ప్రభావం దృష్ట్యా రంపచోడవరం–మారేడుమిల్లి–చింతూరు–భద్రాచలం ఘాట్ రహదారిలో భారీ వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల రాకపోకలకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
వాతావరణ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని, గాలుల తీవ్రత తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.




