Amalapuram: తులిప్ స్కూల్‌లో ఘనంగా పీపుల్ లీడర్ ఎన్నికలు

Amalapuram: విద్యార్థులకు ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు తులిప్ స్కూల్‌లో క్లాస్, స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికలు నిర్వహించారు.

SURESH, AMALAPURAM
Published on: 10 Oct 2026 7:40 PM IST
Amalapuram
X

Amalapuram: తులిప్ స్కూల్‌లో ఘనంగా పీపుల్ లీడర్ ఎన్నికలు

Amalapuram: విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు తులిప్ స్కూల్ కరస్పాండెంట్ నెల్లి రమేష్ ఆధ్వర్యంలో క్లాస్ పీపుల్ లీడర్, స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికలను నిర్వహించారు.

ఈ సాధారణ ఎన్నికల తరహాలో అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తులతో ప్రచారం చేస్తూ,సుమారు నెల రోజులపాటు తోటి విద్యార్థులను ఓట్లు అభ్యర్థించారు.రాజకీయ పార్టీల ప్రచారాన్ని తలపించేలా సాగిన ఈ ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ నాయకులను తులిప్ స్కూల్ విద్యార్ధులు ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల ప్రచారం,ఓటు హక్కు వినియోగం,నాయకత్వ బాధ్యతలపై విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించడం.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య విలువలు,నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది అనితులిప్ స్కూల్ కరస్పాండెంట్ నెల్లి రమేష్ తెలియజేసారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM