Tuni: తుని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం: ఈదురుగాలులకు కూలిన భారీ చెట్టు!

Tuni: కాకినాడ తుని రైల్వే స్టేషన్‌లో 'ఆర్నాబ్' తుఫాను గాలులకు భారీ చెట్టు కూలి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

MANIKANTA, TUNI
Published on: 27 Oct 2026 12:33 PM IST
Tuni
X

Tuni: తుని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం: ఈదురుగాలులకు కూలిన భారీ చెట్టు!

Tuni: బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఆర్నాబ్' తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తుని రైల్వే స్టేషన్ ఆవరణలో విచారకర సంఘటన చోటుచేసుకుంది.

ఈదురుగాలుల తీవ్రతకు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా నేలకూలింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తిపై చెట్టు పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల తక్షణ స్పందన

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టు కొమ్మల కింద చిక్కుకున్న క్షతగాత్రుడిని చాకచక్యంగా వెలికితీశారు.

అనంతరం మెరుగైన వైద్య సహాయం కోసం బాధితుడిని 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI