Rajamahendravaram: మహిళల సాధికారత కోసం కృషి చేస్తాం తురకల నిర్మల!
Rajamahendravaram: మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా తురకల నిర్మల ఎన్నికయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Rajamahendravaram: మహిళల సాధికారత కోసం కృషి చేస్తాం తురకల నిర్మల!
Rajamahendravaram: జిల్లా మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా సమైక్య అధ్యక్షురాలిగా తురకల నిర్మలను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తురకల నిర్మల రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను తిలక్ రోడ్డులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సమాఖ్య కార్యకలాపాలు, మహిళల అభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. తనను జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు నిర్మల కృతజ్ఞతలు తెలిపారు.
మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం సమాఖ్య ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. దుర్గా, సావిత్రి, ఆదిలక్ష్మి, జయంతి ఎమ్మెల్యే వాసును కలిసిన వారిలో ఉన్నారు.
Next Story




