Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

Rajanagaram: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేట వద్ద విషాదం. గోదావరి నదిలో మునిగి ఇద్దరు పాఠశాల విద్యార్థులు మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు.

NARAYANA, RAJANAGARAM
Published on: 28 Jun 2026 9:19 PM IST
Rajanagaram
X

Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రాజంపేట సమీపంలోని మునికూడలి ఇసుక ర్యాంపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.

మృతుల్లో రాజంపేట గ్రామానికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ (15), తండ్రి వెంకటరమణ, వేదులపల్లి హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి కాగా, తొర్రేడు గ్రామానికి చెందిన అల్లూరి మహి (14), తండ్రి శ్రీను, కాటవరం శ్రీమహతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. ఆదివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఇద్దరూ గోదావరిలో స్నానానికి దిగగా, లోతైన ప్రాంతంలోకి వెళ్లి నీటిలో మునిగిపోయినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే గాలింపు చేపట్టి ఇద్దరినీ బయటకు తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

ఈ విషాద ఘటనతో రాజంపేట, తొర్రేడు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story