Kunavaram: కూనవరంలో ఉదయభాస్కర్ కాలనీ జలమయం!
Kunavaram: గోదావరి, శబరి నదుల ఉగ్రరూపంతో కూనవరం మండలంలోని ఉదయభాస్కర్ కాలనీ నీట మునిగింది.
Kunavaram: కూనవరంలో ఉదయభాస్కర్ కాలనీ జలమయం!
Kunavaram: పోలవరంజిల్లా కూనవరం మండలంలోని ఉదయభాస్కర్ కాలనీ వరదలకు నీట మునిగింది. గోదావరి,శబరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో విలీన మండలాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గోదావరి పొంగిపొర్లడంతో కూనవరం మండల కేంద్రంలోని ఉదయ భాస్కర్ కాలనీ నీట మునిగింది.
అర్ధరాత్రి వరద ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు ఏం చేయాలో అర్థం కాక భయం గుప్పెట్లో జీవించారు. శనివారం ఉదయం ఇంటిలోని సామాగ్రిని ఖాళీ చేసి వాహనాల ద్వారా పునరావాస కేంద్రాలకు వెళ్లారు.150 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయామని గగ్గోలు పెడుతున్నారు.
Next Story




