Uppalaguptam: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి దిష్టిబొమ్మ దహనం
Uppalaguptam: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి దేశద్రోహం కేసు పెట్టాలని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో మాల మహానాడు డిమాండ్.
Uppalaguptam: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి దిష్టిబొమ్మ దహనం
ఉప్పలగుప్తం: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి సెంటర్లో మాల మహానాడు ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కల్పిత కథనాలను అల్లుతూ అంబేద్కర్ అగౌరవపరుస్తున్న హమారా ప్రసాద్ అలియాస్ ప్రసాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని దళిత నేతలు డిమాండ్ చేశారు.
అతను పై దేశద్రోహం కింద కేసు పెట్టాలని మాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది.భారత దేశ చరిత్ర అంతా చూసుకుంటే మను ఉగ్రవాద భావజాలాన్ని సృష్టిస్తూ కల్పితలను అల్లుతు చరిత్రను మార్చి రాసే వారు మీరైతే చరిత్రను ఎప్పటికప్పుడు పదిలపరుస్తూ చరిత్రను తెలియపరిచేది చరిత్రను తిరగరాసేది మేము అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసులమని సగర్వంగా చెబుతున్నాం అని మాలమహానాడు తెలియజేసారు.
ఖబర్దార్ మనువాదులారా అని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




