Udimudi: కోనసీమ జిల్లాలో ఘనంగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
Udimudi: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిముడి గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.
Udimudi: కోనసీమ జిల్లాలో ఘనంగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
Udimudi: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం మండలం ఉడిముడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ వంగవీటి రాధా మరియు బండారు సత్యానందరావు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Next Story




