Polavaram: పోలవరం తొలి జడ్పీ పీఠం వంతల రాజేశ్వరికే ఖరారు
Polavaram: పోలవరం జిల్లాలో 7 స్థానాలు గెలిచిన కూటమి.. మహిళా రిజర్వేషన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తొలి జడ్పీ చైర్మన్ పీఠం అధిష్టించడం ఖరారైంది.
Polavaram: పోలవరం తొలి జడ్పీ పీఠం వంతల రాజేశ్వరికే ఖరారు
చింతూరు: పోలవరం జిల్లా... 12 జడ్పీటీసీ స్థానాలు... ఒక్క మాటలో చెప్పాలంటే... కూటమి విజయదుందుభి! కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కూటమి హవానే. ఒక్కో రౌండ్ గడుస్తున్న కొద్దీ ప్రత్యర్థులు వెనకబడిపోయారు. చివరకు 7 స్థానాల్లో కూటమి జెండా ఎగిరింది.ఇప్పుడు జిల్లా మొత్తం ఒకటే హీట్... జడ్పీ పీఠం ఎవరికి ? అసలు కథ ఇక్కడే మొదలైంది.
పోలవరం జడ్పీ చైర్మన్ పీఠం... మహిళకు రిజర్వ్.అంటే... పీఠం ఎక్కేది ఒక ఆడబిడ్డే. అప్పుడే తెరపైకి వచ్చింది ఒక్కటే పేరు... మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ! టీడీపీ అధిష్టానం ముందు నుంచే ఫిక్స్ అయిపోయింది. రాజేశ్వరి నే ఆ పీఠంపై కూర్చోబెట్టాలని. ఆమెకు మాట కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ... పొత్తులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.
ఒకవేళ జనసేన తరపున ఏ మహిళా జడ్పీటీసీ అయినా గెలిచి ఉంటే... పొత్తు ధర్మం ప్రకారం ఆ పీఠం జనసేనకే వెళ్లేది.జనసేన శ్రేణులు కూడా ఆశగా ఎదురుచూశారు. చైర్మన్ పీఠం మాకే వస్తుందేమో అని. కానీ... అక్కడే అసలు ట్విస్ట్ !
జడ్పీటీసీ పోటీలో జనసేన తరపున ఒక్క మహిళా జడ్పీటీసీ కూడా గెలవలేదు. ఆ ఒక్క ఫలితంతో లెక్క మొత్తం మారిపోయింది. జనసేనకు అవకాశం లేకుండా పోయింది. పొత్తులో అడ్డంకి తొలగిపోయింది. ఇప్పుడు వంతల రాజేశ్వరి కి పోటీయే లేదు.టీడీపీ అధిష్టానం ఇచ్చిన మాట... జనసేనలో మహిళా జడ్పీటీసీ లేకపోవడం... రెండూ కలిసి రాజేశ్వరి పీఠాన్ని ఖరారు చేశాయి. ఇక మిగిలింది ఒక్కటే... ఆమె ఆ పీఠాన్ని అధిష్టించడమే తరువాయి.
ఈ వార్త తెలియగానే కార్యకర్తలు, నాయకులు సంబరాలు మొదలుపెట్టేశారు. అడ్డతీగల లో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే... పోలవరం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ గా చరిత్రలో నిలిచిపోబోయేది వంతల రాజేశ్వరి నే .తొలి చైర్మన్... తొలి మహిళా చైర్మన్..ఆ కిరీటం రాజేశ్వరి తలపై పెట్టడానికి జిల్లా సిద్ధమైపోయింది.అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది ఆ క్షణం కోసం పోలవరం జిల్లా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది.




