Malikipuram: మలికిపురంలో రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేత!

Malikipuram: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు అనారోగ్య బాధితులకు ఆర్థిక చేయూత అందించారు. మొత్తం రూ. 30,000

PRABHU, RAZOLE
Published on: 21 Aug 2026 12:34 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేత!

Malikipuram: అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు బాధితుల వైద్య ఖర్చుల నిమిత్తం వసుధ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ జంపన బుజ్జిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఈ సహాయాన్ని అందజేశారు.

మలికిపురంలోని జంపన బుజ్జిరాజు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఏ.వి.పాలెంకు చెందిన ఇంజేటి పన్నీకి రూ.20,000, వీవీ మెరకకు చెందిన మొల్లేటి ఏసుబాబుకు రూ.10,000 చొప్పున మొత్తం రూ.30,000ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనారోగ్య బాధితుల కుటుంబ సభ్యులు వసుధ ఫౌండేషన్ చైర్మన్ (హైదరాబాద్) శ్రీ మంతెన రామరాజు, కన్వీనర్ జంపన బుజ్జిరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం రాజు, రాపాక చిన్ని, తాడి సహాదేవ్, చిక్కా అశోక్ కుమార్, నల్లి సురేంద్ర, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story