Amalapuram: అమలాపురంలో ఘనంగా బొజ్జా తారకం వర్ధంతి సభ!
Amalapuram: ఈదరపల్లిలో బొజ్జా తారకం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వీసీకే రాష్ట్ర నేత బొంతు రమణ పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆశయాలను కొనియాడారు.
Amalapuram: అమలాపురంలో ఘనంగా బొజ్జా తారకం వర్ధంతి సభ!
అమలాపురం: ప్రజా హక్కుల కోసం పోరాడిన మహోన్నత యోధుడు బొజ్జా తారకం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన వి.సి.కె పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ
అణగారిన వర్గాల హక్కుల కోసం,సామాజిక న్యాయం కోసం,కుల వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన ప్రముఖ న్యాయవాది,రచయిత, దళిత ఉద్యమ నాయకుడు బొజ్జా తారకం వర్ధంతి సందర్భంగా ఈదరపల్లి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వి.సి.కె పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వి.సి.కె పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ మాట్లాడుతూ,బొజ్జా తారకం అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం,సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
బొజ్జా తారకం కారంచేడు, చుండూరు సంఘటనలు లో బాధితుల తరుపున హైకోర్టు లో న్యాయ పోరాటం చేసారాని న్యాయవాదిగా,రచయితగా, ప్రజా ఉద్యమకారుడిగా బడుగు బలహీన వర్గాల సమస్యలను సమాజం ముందుకు తీసుకువచ్చారని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా, రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికీ అందేలా ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ,సామాజిక సమానత్వం,కుల వివక్ష నిర్మూలన కోసం బొజ్జా తారకం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని బొంతు రమణ అన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, సామాజిక న్యాయం సాధించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ,వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్,వి సి. కె జిల్లా అధ్యక్షులు మెండి డేవిడ్ అంబేద్కర్, జిల్లా యూత్ అధ్యక్షులు పొలమూరి సందీప్,సాపే రమేష్,జల్లి సంతోష్,బీర వెంకట రమణ జల్లి అజయ్,నేల ప్రశాంత్,
విజయ్ మట్టా సురేష్ వేదిక నాయకులు బద్దే వినయ్,ఇంగువ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.వి.సి.కె పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొని బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన ఘన నివాళులు అర్పించారు.




