Rampachodavaram: ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్ల పంపిణీ: వేదాగ్ని ట్రస్ట్!

Rampachodavaram: రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. పోషకాహారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

Prasanna, Rampachodavaram
Published on: 26 Aug 2026 8:46 AM IST
Rampachodavaram
X

Rampachodavaram: ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్ల పంపిణీ: వేదాగ్ని ట్రస్ట్!

Rampachodavaram: వేదాగ్ని ట్రస్ట్ అధినేత శ్రీ మంజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పోలవరం జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గర్భిణీల ఆరోగ్యం మెరుగుపడాలని, వారికి పోషకాహారం అందించాలని లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జి చిన్నం టోనీ బాబు, చిన్నం కుమారి, చేదల స్వరూప రాణి, పోలేపల్లి లక్ష్మి, పంజా ఆది రెడ్డి, సుంకరి దుర్గ రెడ్డి, కొమరం శాంతి, రాజు దొర, కారం నరసింహ పాల్గొని గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వేదాగ్ని ట్రస్ట్ అధినేత శ్రీ మంజు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, సమాజ సేవే వేదాగ్ని ట్రస్ట్ ధ్యేయమని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story