Rampachodavaram: ఆసుపత్రిలో వేదాగ్ని ట్రస్ట్ సేవా కార్యక్రమం!
Rampachodavaram: రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. మంజు శ్రీనివాస్ నేతృత్వంలో కొనసాగిన సేవలు.
Rampachodavaram: ఆసుపత్రిలో వేదాగ్ని ట్రస్ట్ సేవా కార్యక్రమం!
Rampachodavaram: పోలవరం జిల్లా, రంపచోడవరం వేదాగ్ని ట్రస్ట్ అధినేత మంజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పడంతో పాటు అల్పాహారాన్ని అందజేశారు. సమాజసేవ లక్ష్యంగా వేదాగ్ని ట్రస్ట్ నిరంతరం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జ్ చిన్నం టోనీ బాబు, చిన్నం కుమారి, కె. నరసింహమూర్తి ( నాని) సుంకరి దుర్గ రెడ్డి, పోలేపల్లి సతీష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
'మానవసేవే మాధవసేవ' అనే లక్ష్యంతో వేదాగ్ని ట్రస్ట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.




