Razole: అధిక ధరలకు నిత్యావసర సరుకుల విక్రయం.. రాజోలులో విజిలెన్స్ కొరడా
Razole: నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై రాజోలు పరిధిలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
Razole: అధిక ధరలకు నిత్యావసర సరుకుల విక్రయం.. రాజోలులో విజిలెన్స్ కొరడా
రాజోలు: ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఏపీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, రాజమండ్రి విజిలెన్స్ ఎస్పీ ఎన్.టి.వి. రామకుమార్ పర్యవేక్షణలో విజిలెన్స్, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బృందాలు రాజోలు నియోజకవర్గం లోని తాటిపాక, గెద్దాడ, వి.వి.మెరక తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న పలు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ.. వ్యాపారులు ప్రభుత్వ నిర్ణీత ధరలకే నిత్యావసర సరుకులు విక్రయించాలని, ప్రజలను దోపిడీ చేస్తూ అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.




