Razole: గోదావరి నుండి అక్రమ ఇసుక రవాణా వాహనాలు సీజ్!

Razole: రాజోలు మండలం సోంపల్లిలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్, ట్రాక్టర్ సీజ్ చేసి పీఎస్‌కు తరలింపు.

PRABHU, RAZOLE
Published on: 10 July 2026 1:12 PM IST
Razole
X

Razole: గోదావరి నుండి అక్రమ ఇసుక రవాణా వాహనాలు సీజ్!

Razole: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక టిప్పర్ లారీ, ఒక ట్రాక్టర్‌ను అధికారులు సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం వాటిని రాజోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story