Rajahmundry: రాజమండ్రిలో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి!
Rajahmundry: రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరేష్.
Rajahmundry: రాజమండ్రిలో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి!
Rajahmundry: విశ్వకర్మ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ లలో వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం లో ఓబీసీ మోర్చా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని విశ్వకర్మ భగవానుని చిత్ర పటానికి పూలమాలలు వేశారు, పలువురు విశ్వకర్మలను సాల్వాలతో సత్కరించారు, పలువురు విశ్వకర్మలు బీజేపీ పార్టీ తీర్థం తీసుకున్నారు ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ సృష్టికి మూలాధారం విశ్వకర్మల శేవలే అని, వారి సేవలను కొనియాడారు.
శ్రామికులు అందరూ విశ్వకర్మ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని, మేడే అనేది మన సంస్కృతి లో లేదని విశ్వకర్మ జయంతే మన కార్మికుల పండుగ అని, కార్మికులు అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, కాలెపు సాయిరాం, నర్సిపల్లి హరిక, రేలంగి శ్రీదేవి, కురగంటి సతీష్, కందికొండ రమేష్, పెరుమాళ్ పవన్, తగరం సురేష్ బాబు, వీర వీరాంజనేయులు, గుత్తుల ధనలక్ష్మి స్వామి సూర్య కిరణ్, తదితరులు పాల్గొన్నారు.




