Nidadavole: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల కోసం నిడదవోలులో నిరసన
Nidadavole: విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిడదవోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Nidadavole: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల కోసం నిడదవోలులో నిరసన
Nidadavole: నిడదవోలు ఈనెల 8వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ విస్పోటనంలో మృతి చెందినతొమ్మిది మంది కార్మిక కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని క్షతగాత్ర కుటుంబాలకు 50లక్షల రూ చొప్పున నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని సీపీఎం నాయకులు జువ్వలరాంబాబు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ రైల్వే స్టేషన్ సెంటర్లో సీఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ముందుగా మరణించిన కార్మికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు మృతుల కుటుంబాలకు సంతాపం సానుభూతిని తెలియ చేశారు స్టీల్ ప్లాంట్ విస్పోటనంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రవేటీకరణ ఈ దుస్థతికి కారణం అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ ఆలోచన మానుకోవాలని స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు M సుందరబాబు మాట్లాడుతూ కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. కార్మిక సంఘాల నాయకులతో మంత్రి నారా లోకేష్ వాగ్వివాదం చెయ్యటం సరికాదని విమర్శించారు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న కార్మికులందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు.




