Nidadavolu: కూటమి అభ్యర్థులనే గెలిపించండి: మంత్రి కందుల దుర్గేష్
Nidadavolu: నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేషారావు పిలుపునిచ్చారు.
Nidadavolu: కూటమి అభ్యర్థులనే గెలిపించండి: మంత్రి కందుల దుర్గేష్
తూర్పుగోదావరి జిల్లా: నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం. పాల్గోన్న మంత్రి కందుల దుర్గేష్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు!
బూరుగుపల్లి శేషారావు కామెంట్స్: రేపు సాయంత్రం తో ప్రచారం ముగుస్తుంది! మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గా జనసే పార్టీ తరపున, వైస్ చైర్మన్ టిడిపి తరపున పోటీలో ఉన్నారు.అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థుల కు ఓట్లు వేయాలని కోరుతున్నాం. రాష్ట్రంతో పాటు మన పట్టణ అభివృద్ధి కూడా ముఖ్యం! కూటమి మధ్య చిచ్చు లేపటానికి వైసిపి ప్రయత్నం చేస్తుంది.
వంద పడకల అభివృద్ధి కి కొబ్బరి కాయ కొట్టాం అని చెప్పుకుంటున్నారు.అదంతా గ్రాఫిక్స్! టిడిపి ప్రభుత్వం లోనే నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చెందింది! ఆర్వోబి నిర్మాణానికి చంద్రబాబు చేతులతో శంకుస్థాపన జరిగింది. టిట్కో ఇళ్ళు టిడిపి హయాంలో శరవేగంగా నిర్మాణం జరిగితే..మీ ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు, మార్చి నెలలో టిట్కో ఇళ్ళు లబ్దిదారులకు అందిజేస్తాం.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మురాల జ్యోతిని కూటమి తరపున పోటీ లో ఉన్న అభ్యర్థుల కు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం.
మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్:-
యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదం తో ఒక దళిత యువతి మురాల జ్యోతిని చైర్మన్ గా పోటీలో నిలబెట్టాం! మీ ఇంటి బిడ్డగా ఆశ్వీరదిచండి! మూడు పార్టీల కలయిక తో త్రిబుల్ ఇంజన్ సర్కారు తో ఒక వైపు దేశం మరో వైపు రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి లో దూసుకు పోతుంది!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం! మాజీ శాసనసభ్యులు గా బూరుగుపల్లి శేషారావు అనేక అభివృద్ధి పనులు కు శంకుస్థాపనలు చేశారు.. కూటమి ప్రభుత్వంలో వాటితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు నిడదవోలు లో జరుగుతున్నాయి!
గత ప్రభుత్వం టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళకి ఫ్లాట్స్ అప్ప చెప్పలేక పోయారు.ఆ లోన్లు ఇప్పుడు గుదిబండగా మారాయి! చిన్న కాశీ రేవు ను ఆథ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం.. దానితో పాటు రివర్ ఫ్యూ పార్కు ను నిర్మిస్తున్నాం! పట్టణంలో పర్యాటక శోభ సంతరించుకునే విధంగా మాలకోడు చెరువును జూబ్లీ పార్క్ లా అభివృద్ధి చేస్తున్నాం!
పుష్కరాలు కు ముందే ఆర్వోబి నిర్మాణాం పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందిస్తాం! పట్టణానికి 195 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం! రానున్న రెండు సంవత్సరాల లో పట్టణంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తాం! రైతు మార్కెట్ ను కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు! పట్టణ ప్రజలకు త్వరలో రైతు మార్కెట్ అందిస్తాం! అభివృద్ధిని కొనసాగించాలంటే కూటమి అభ్యర్థుల ను గెలిపించండి.




