Amalapuram: 73.74 శాతం ఓటర్ల డేటా డిజిటైజేషన్ పూర్తి వివరాలు ఇవే!

Amalapuram: కోనసీమ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ (JC) వైఖోం నైదియాదేవి తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 8 July 2026 11:44 PM IST
Amalapuram
X

Amalapuram: 73.74 శాతం ఓటర్ల డేటా డిజిటైజేషన్ పూర్తి వివరాలు ఇవే!

అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి తెలిపారు.

జిల్లాలో మొత్తం 9,69,628 మంది ఓటర్లకు సంబంధించిన 73.74 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఓటరు హెల్ప్ డెస్కులు సమర్థవంతంగా పనిచేస్తూ, ఓటర్లకు ఫారాలు నింపడం, సందేహాల నివృత్తి చేయడం వంటి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. బీఎల్ఓలు, ఈఆర్‌వోలు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.

నియోజకవర్గాల వారీగా డిజిటైజేషన్ వివరాలు:

రామచంద్రపురం – 1,58,056 (77.60%)

ముమ్మిడివరం – 1,73,563 (70.59%)

అమలాపురం – 1,52,662 (71.26%)

రాజోలు – 1,45,639 (73.21%)

పి. గన్నవరం – 1,51,498 (76.08%)

కొత్తపేట – 1,88,210 (74.34%)

జూలై 14లోపు అన్ని ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి చేయాల్సి ఉన్నందున, ప్రతి ఓటరు తమ ఫారాన్ని వెంటనే సంబంధిత బీఎల్ఓకు అందించాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఫారం అందని వారు బీఎల్ఓను సంప్రదించడం లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా "Book a Call with BLO" సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లు తమ EPIC నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో కూడా ఫారం సమర్పించవచ్చని పేర్కొన్నారు.

ఓటర్ల తొలగింపే లక్ష్యంగా ఈ కార్యక్రమం కాదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story