Mamidikuduru: సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదు.. వీఆర్ఏలు!

Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో 23వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల సమ్మె. తహశీల్దార్ కార్యాలయం ఎదుట పొర్లుదండాలతో వినూత్న నిరసన.

PRABHU, RAZOLE
Published on: 8 Oct 2026 12:38 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదు.. వీఆర్ఏలు!

Mamidikuduru: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు గురువారం మామిడికుదురులో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా 23వ రోజు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద పొర్లుదండాలు పెడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడంపై వీఆర్ఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE