Mamidikuduru: మామిడికుదురులో 20వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె!
Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో వీఆర్ఏల నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
Mamidikuduru: మామిడికుదురులో 20వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె!
Mamidikuduru: బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు సోమవారం 20వ రోజు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, తగిన విధంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఎన్నో రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసనను కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.




