Kadiam: అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలు: కడియంలో క్విజ్ పోటీలు
Kadiam: అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా కడియం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.
Kadiam: అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలు: కడియంలో క్విజ్ పోటీలు
కడియం: అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకొని, మండల స్థాయిలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు వేరువేరుగా క్విజ్ పోటీలు నిర్వహించినట్లు కడియం మండల విద్యాశాఖ అధికారి ఎం మణికుమార్ తెలిపారు.
శనివారం కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి దుర్గా సత్య శ్రీ ప్రసన్న ప్రథమ స్థానంలోనూ, వీరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అప్పారి హేమశ్రీ దుర్గ ద్వితీయ స్థానంలోనూ విజేతలుగా నిలిచారని తెలిపారు.
అలాగే ప్రైవేటు పాఠశాలలో విభాగంలో కడియం మాస్టర్ మైండ్స్ స్కూలుకు చెందిన పోలిన ధన దీపిక ప్రథమ స్థానంలోనూ, మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన నాగం అనూష ద్వితీయ స్థానంలో విజేతలుగా నిలిచారని తెలిపారు.
విజేతలకు అక్టోబర్ 8వ తేదీన ఆనం కళా కేంద్రంలో నిర్వహించే అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవంలో ఇస్రో శాస్త్రవేత్తల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, బి సువర్ణ వేణి, జి శ్రీనివాస్, డేవిడ్, ఇతర ఉపాధ్యాయులు విజేతలకు అభినందనలు తెలిపారు.




