Razole: రాజోలు నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్లేశ్వరరావు
Razole: రాజోలు ఎమ్మార్వోగా వై. మల్లేశ్వరరావు బాధ్యతల స్వీకరణ. ప్రజలకు పారదర్శకమైన, సత్వర సేవలు అందించాలని అధికారులకు నూతన తహసీల్దార్ సూచన.
Razole: రాజోలు నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్లేశ్వరరావు
రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండల నూతన తహసీల్దార్ (ఎమ్మార్వో)గా వై. మల్లేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొద్ది నెలలుగా ఖాళీగా ఉన్న ఎమ్మార్వో స్థానంలో ఆయన నియమితులయ్యారు.
ఇప్పటివరకు కృష్ణా జిల్లా సీఆర్డీఏలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన మల్లేశ్వరరావు, ఉద్యోగోన్నతిపై రాజోలుకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్‌తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది నూతన ఎమ్మార్వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ఆయన పరిచయ సమావేశం నిర్వహించి, ప్రజలకు పారదర్శకంగా, సత్వర సేవలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Next Story




