Rajahmundry: పార్కిన్సన్స్‌కు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ భరోసా!
Rajahmundry: రాజమండ్రిలో యశోద హైటెక్ సిటీ వైద్యుల సమాmeeting. పార్కిన్సన్స్ వ్యాధి నివారణకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) చికిత్సపై అవగాహన.
Rajahmundry: పార్కిన్సన్స్‌కు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ భరోసా!
Rajahmundry: * రాజమండ్రి మీడియా సమావేశంలో యశోద హైటెక్ సిటీ వైద్య బృందం వెల్లడి
* మెదడులో డోపమైన్ క్షీణతతో యువతనూ కబళిస్తున్న నరాల బలహీనత రుగ్మత
* ముదిరిన వ్యాధికి మూడు దశాబ్దాల నమ్మకమైన పరిష్కారం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్
* తాత్కాలిక చికిత్సల కంటే సమగ్ర నియంత్రణ నిచ్చే శస్త్రచికిత్సకే అగ్ర ప్రాధాన్యం
* అవగాహన పెంచుకుంటేనే బాధితుల్లో ఆత్మవిశ్వాసం, మెరుగైన జీవన ప్రమాణాలు
రాజమండ్రి:
పార్కిన్సన్స్ వ్యాధి నివారణ, అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక మార్పులపై విస్తృత చర్చ జరిగింది. మానవ మేధస్సును, శారీరక కదలికలను క్రమంగా క్షీణింపజేసే ఈ నరాల రుగ్మత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ప్రతి లక్ష మందిలో దాదాపు 15 నుండి 43 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారని, మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా యువత సైతం ఈ ముప్పు బారిన పడటం సామాజిక భారాన్ని పెంచుతోందని వివరించారు. మెదడులో శారీరక సమతుల్యతను కాపాడే డోపమైన్ అనే రసాయన ఉత్పత్తి తగ్గడమే ఇందుకు మూలకారణమని, పర్యావరణ వైవిధ్యాలు, జన్యుపరమైన లోపాల కలయిక వల్లనే ఈ సమస్య తలెత్తుతుందని యశోద హైటెక్ సిటీ వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
ఈ వ్యాధి కారణంగా బాధితులు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే సమస్యలు అత్యంత క్లిష్టంగా ఉంటాయని రాజమండ్రి నగరంలోని యశోద హైటెక్ సిటీ ప్రతినిధులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. శరీర భాగాలు నిరంతరం వణకడం, నడకలో వేగం తగ్గడం, కండరాలు బిగుసుకుపోవడం, మాటతో పాటు చేతిరాతలో స్పష్టత లోపించడం వంటి బాహ్య కదలికల లోపాలు ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు తీవ్ర మలబద్ధకం, వాసన గుర్తించే శక్తిని కోల్పోవడం, తీవ్ర నిద్రలేమి, జ్ఞాపకశక్తి మందగించడం, రక్తపోటులో అస్థిరత వంటి అంతర్గత సమస్యలు రోగులను నరకప్రాయానికి గురిచేస్తాయని వైద్యులు తెలిపారు. ప్రారంభంలో ఔషధాల ద్వారా ఈ లక్షణాలను అదుపు చేసినప్పటికీ, కాలక్రమేణా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మందుల ప్రభావం క్రమంగా క్షీణిస్తుందని వారు పేర్కొన్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో చిక్కుకున్న రోగుల పాలిట యశోద హైటెక్ సిటీ అందిస్తున్న డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ఒక సంజీవనిలా మారిందని నిపుణులు ఉద్ఘాటించారు. గత ముప్పై ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ ప్రక్రియలో మెదడులోని లూప్‌లను విద్యుత్ సంకేతాల ద్వారా సరిచేసే అత్యాధునిక పరికరాన్ని ఛాతీ భాగంలో అమరుస్తారు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కోత లేని అల్ట్రాసౌండ్ వంటి తాత్కాలిక పద్ధతులతో పోలిస్తే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అత్యంత సురక్షితమైనదని, శాస్త్రీయమైనదని నిరూపితమైంది. అల్ట్రాసౌండ్ పద్ధతిలో మెదడు కణజాలం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉండటమే కాకుండా అది కేవలం వణుకును మాత్రమే నియంత్రిస్తుంది. కానీ యశోద హైటెక్ సిటీ రోగులకు సూచించే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ విధానం మెదడుకు ఇరువైపులా చికిత్స చేయడమే కాకుండా, భవిష్యత్తులో రోగి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు, అవసరమైతే పూర్వస్థితికి తెచ్చేందుకు సంపూర్ణ సదుపాయాన్ని కల్పిస్తుంది.
మందుల వల్ల ఉపశమనం లభించని రోగులకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా పరిపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛా పూరిత జీవనాన్ని అందించవచ్చని యశోద హైటెక్ సిటీ పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ కోర్స్ డైరెక్టర్, ప్రముఖ న్యూరాలజిస్ట్ రూపమ్ బొర్గోహైన్ స్పష్టం చేశారు. సమాజంలోనూ, వైద్య రంగంలోనూ ఈ చికిత్సపై మరింత అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యశోద హైటెక్ సిటీ న్యూరాలజీ విభాగానికి చెందిన రూపమ్ బొర్గోహైన్, రుక్మిణి మృదుల, శృతి కోలా లతో కూడిన నిపుణుల బృందం ఈ సమావేశంలో రోగుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ హెడ్ డిజిఎం జి సంతోష్ కుమార్, మార్కెటింగ్ టీం లీడర్ రామకృష్ణ
కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ పాల్గొని బాధితులకు అత్యాధునిక వైద్య సేవలను చేరవేయడంలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని పునరుద్ఘాటించారు.




