PGannavaram: పి.గన్నవరంలో జనసేనలోకి వలసలపై వైసీపీ, జనసేన మాటల యుద్ధం!
PGannavaram: పి.గన్నవరం మండలం ముంగడపాలెంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన నేతలపై తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు తీవ్రంగా మండిపడ్డారు.
PGannavaram: పి.గన్నవరంలో జనసేనలోకి వలసలపై వైసీపీ, జనసేన మాటల యుద్ధం!
PGannavaram: పి గన్నవరం మండలం ముంగడ పాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్,మాజీ ఎంపీటీసీ, వీరితో సహా సుమారు 60 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
దీనిపై పి గన్నవరం వైసిపి కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు కొంతమంది వైసిపి కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తూ జనసేనలో చేరిన వారు వైసీపీ కార్యకర్తలు కాదని వారు గతంలో టిడిపి పార్టీకి చెందిన వారని అంతేకాకుండా పొత్తు ధర్మ పాటించకుండా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ టిడిపి నాయకులను జనసేనలో జాయిన్ చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
వెంటనే దీనిపై జనసేనలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పలువురు కార్యకర్తలు స్థానికంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వైసిపి కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరి కొంత మంది వైసీపీ నాయకులు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మేము గతంలో వైసీపీ పార్టీ నుండి మా గ్రామం ఎంపీటీసీని గెలిపించుకోవడం నిజం కాదా? అంతేకాకుండా 2024 ఎలక్షన్స్ సమయంలో వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయడం చూడలేదా అంటూ గన్నవరపు శ్రీనివాసరావు పై మండిపడ్డారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని,మాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు అని గన్నవరం శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు.




