Rajahmundry: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఖాళీ భరత్!
Rajahmundry: వైసిపి జాతీయ ప్రతినిధి మార్గాని భరత్ రామ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ "జగన్ 2.0" మరియు మోరంపూడి దీక్షల పోస్టర్లను ఆవిష్కరించారు.
Rajahmundry: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఖాళీ భరత్!
రాజమండ్రి: స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రాష్ట్రంలో కూటమి పార్టీల ప్రభుత్వం పేకమేడలా కుప్పకూలడం ఖాయమని, తడిగుడ్డతో గొంతులు కోయడం టీడీపీ నైజమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసిపి జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల్ని ఏమార్చి తప్ప్పుడు హామీలతో అధికారంలోకి తచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్‌లో ఉన్న వైసిపి సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ టీడీపీ నాయకుడు ఒక స్త్రీ మూర్తి ని వివస్త్రగా చేయడం దారుణమని, దీన్ని బట్టి వారి నైజం ఎంటో అర్థమవుతోందన్నారు. సిసి కెమేరాలు లేకపోతే ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చేది కాదన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి ఇంతకంటే ఏం చేతనవుతుందని నిలదీసారు.
ఈ ఘటనపై జాతీయ మహిళా కమీషన్, హ్యూమన్ రైట్స్ కమీషన్, రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం సుమోటోగా తీసుకుని విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇంత అనాగరిక చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు మళ్లీ తమ వైసిపిని గొడ్డలి పార్టీ అంటున్నారని, వెన్నుపోటుతో పుట్టిన పార్టీ అదేనని ఎద్దేవా చేసారు. దేశంలో అత్యున్నత మైన సిబిఐ, ఇడి వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్నాయన్నారు. ఈ కేసులో దస్తగిరి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తున్నారని, దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు. సిద్ధార్థ లూద్రా చంద్రబాబు పర్సనల్ లాయర్ అని డైవర్షన్ రాజకీయాలకు పాల్పడటానికే వైసిపిపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లక్ష కోట్లు అంటూ ఆరోపణలు చేసారని, చివరికి అది ఏమైందో అందరికి తెలిసిందేనని వ్యాఖ్యానించారు. పదే పదే తాడేపల్లి ప్యాలెస్ అంటూ జగన్‌పై బురద జల్లుతున్నారని ఆ ఇల్లు సాధారణంగానే ఉంటుందని, హైదరాబాద్‌లో చంద్రబాబు ఉంటున్న ఇల్లు మాత్రం బకింగ్ హామ్ ప్యాలెస్‌ను తలపిస్తుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్ప్పుడు వీడియోల్లో ఆ ఇల్లు చూసామన్నారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కడతామని ఇచ్చిన హామీ ఏమైందని, ఇప్పటికే ల్యాండ్ పూలింగ్‌లో అక్కడ 50 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని, దానిలో 2 వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు కట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సాక్షాస్తూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా రామ్మోహన్ నాయుడు మీ పార్టీకి చెందిన వ్యక్తే ఉన్నారని, నిధులు మంజూరు చేయించుకుని ప్రధాని మోదీతో మాట్లాడి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేసారు.
పవన్ కళ్యాణ్ కాపు ఎమోషన్స్ రెచ్చగొట్టి ఓట్లేయించుకున్నారని, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చంద్రబాబు ప్రజల్ని మోసం చేసారని ఆరోపించారు. 64 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, వారి వద్ద నుంచి 2 వేల చొప్ప్పున పాఠశాలల నిర్వహణకు వసూలు చేస్తున్నారని ఆ డబ్బు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేసారు. అది కూడా స్వాహా చేసేసారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అనంతరం జగన్ 2.0 పోస్టర్‌ను, ఈనెల 21వ తేదీన మోరంపూడి జంక్షన్‌లో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా, అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రతీ ఒక్కరు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. మోరంపూడి ఫ్లైఓవర్‌ను వైసిపి పాలనలో తాము నిర్మాణం చేస్తే కూటమి ప్రజా ప్రతినిధులు తాము చేశామంటే.
తాము చేశామంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప రెండేళ్లయినా ఇంతవరకు సర్వీస్ రోడ్లు వేయలేకపోయారని మండిపడ్డారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు క్రెడిట్ చోరీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఫ్లైఓవర్‌కు సంబంధించిన వివరాల రికార్డులను తాను ఢిల్లీ నుంచి తెప్పించానని, అది మంగళవారం ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. ఫైఓవర్ సర్వీసు రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్నామని, కూటమి ప్రభుత్వం మెడలు వంచి సర్వీసు రోడ్లు వేసేలా చేస్తామని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, మార్తి లక్ష్మీ, పోలు విజయలక్ష్మి సంకిస భవానీప్రియ, ముప్పన ప్రభాకర్, మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్ , దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, తిరగటి దుర్గారావు, అరె చిన్ని, దూర్వాసుల సత్యనారాయణ, కొండేటి సుధ, పొదిలపు నాగు, దత్తా, కట్టా వెంకటేష్, నల్లా రామాంజనేయులు, రొక్కం త్రినాధ్, కొమ్మోజు దుర్గారావు, వట్టికూటి కృష్ణవేణి, అనురాధ, అనంతలక్ష్మి, దాడి శంకర్, కల్లి మురళి, సుందర్ సింగ్, రేగుళ్ల శ్రీధర్, గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి, గుత్తుల భాస్కర్, సయ్యద్ హసన్, కొమ్మోజు దుర్గారావు, మార్గాని రాము తదితరులు పాల్గొన్నారు.




