Rajahmundry: జగన్ సీఎం కావాలని మౌనవ్రతంతో తిరుపతికి పాదయాత్ర!
Rajahmundry: వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ రాజమండ్రికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాయి మౌనవ్రతంతో తిరుపతికి పాదయాత్ర ప్రారంభించారు.
Rajahmundry: జగన్ సీఎం కావాలని మౌనవ్రతంతో తిరుపతికి పాదయాత్ర!
Rajahmundry: వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ స్థానిక 36వ డివిజన్‌కు చెందిన యువ కార్యకర్త మౌన వ్రతంతో తిరుపతి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆ పాదయాత్రను స్థానిక శ్యామలా సెంటర్‌లో మాజీ ఎంపీ, వైసిపి జాతీయ అధికార ప్రతినిధి, సిటీ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్ కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ఆ వైసిపి కార్యకర్త బొడ్డాపు సాయి పాదయాత్రను ప్రారంభించారు.
ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న ఆ యువకుడిని 36వ డివిజన్ ఆదెమ్మదిబ్బకు చెందిన వైసిపి నాయకుడు శంకర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌కు వద్దకు తీసుకుని వచ్చి పరిచయం చేసారు. సాయి చేపట్టిన యాత్ర నిర్విఘ్నంగా పూర్తి కావాలని, అతడు అనుకున్న లక్ష్యం మేకు ప్రయాణం సాగాలని భరత్ రామ్ ఆకాంక్షించారు. తిరుపతి పాదయాత్ర పూర్తి చేసిన తరువాత తాను శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళతానని అతడు తెలిపాడు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్లీ ఖచ్చితంగా సిఎం అవుతారని ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని భరత్ అన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు జగన్‌కు ప్రజలు మద్దతుగా నిలబడేలా చూడాలని కోరారు.




